ఒక్క గ్లాస్ చెరకు రసంతో ఎన్ని మంచి ఫలితాలో తెలుసా..?

తియ్యగా నోటికి కమ్మగా, అమృతంలా అనిపించే చెరకు రసం ఇష్టపడని వారుండరు..
రుచికే కాదు చెరకు రసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చెరుకు రసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల అన్ని వయసుల వారికి కూడా ఎంతో మంచిది.
చెరకు రసం తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది.
కిడ్నీ ఆరోగ్యానికి కూడా చెరుకు రసం మేలు చేస్తుంది. శరీరంలో ప్రోటీన్ లెవెల్స్‌ను పెంచుతుంది.
ఒంట్లో వేడిని చిటికెలో తగ్గిస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేయడంలోనూ ఇది ఎంతో ప్రయోజనకారి.
కాలేయానికి వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా కామెర్ల వ్యాధి నుంచి కాపాడుతుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది.
చెరకులో పీచు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం ఆకలి కలిగించదు. బరువు త్వరగా తగ్గవచ్చు.
ఇది ఆరోగ్యానికి కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తోంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. ఏమైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు.