హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతోందా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే?

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. అయితే దీనికి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.
హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం చాలా ప్రమాదకరం. అయితే హెల్మెట్ పెట్టుకున్నా కానీ, హెయిర్ లాస్ కాకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే.
తలస్నానం చేసిన తర్వాత ఒకవేల బైక్‌పై బయటకు వెళ్తే జుట్టు పొడిబారిన తర్వాతనే హెల్మెట్ ధరించాలి.
తలపై హెల్మెట్ పెట్టుకునేటప్పుడు ఖర్చీఫ్ లేదా ఏదైనా క్లాత్ కట్టుకోవాలి.దీంతో హెల్మెట్ లోపలి భాగం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించే సమయంలో జడ వేసుకోవడం మంచిది.
అలాగే ఎల్లప్పుడు క్వాలిటీ ఉన్న హెల్మెట్లను పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుంచి బయపడటంతో పాటు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
నిత్యం వాడే హెల్మెట్ లోపలి వైపు ఉండే కుషనింగ్ మీద ఉన్న మురికిని తరచూ శుభ్రపరచుకోవడం వల్ల జుట్టు రాలదు.
కొంత మంది హెల్మెట్‌ను తీసేటప్పుడు హడావిడిగా లాగేస్తుంటారు. అలా చేయడం వల్ల జుట్టు తెగిపోతుంది. నెమ్మదిగా హెల్మెట్‌కు అతుకున్న జుట్టు ఊడిపోకుండా తీయాలి.
హెల్మెట్ వాడినప్పుడు గాలి తగిలే చోట కానీ, ఎండలో గాని ఉంచినట్లైతే హెల్మెట్ లోపల ఫంగస్ ఏర్పడకుండా ఉంటుంది. దీంతో జుట్టుకు ఎలాంటి హాని జరగదు.