టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ సౌందర్యంపై ప్రభావం పడుతుందా?

చాలా మంది అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ, టీ తాగకుండా మాత్రం బతకలేరు.
ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని రాత్రి పోయే వరకు లెక్కలేకుండా తాగుతుంటారు.
అయితే అలా తాగడం వల్ల అందంపై ప్రభావం పడుతుందా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
టీ తాగడం వల్ల చర్మం నల్లబడుతుందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్ట్రీయ ఆధారాలు లేవు.
నిపుణుల ప్రకారం చర్మం రంగు మీ జీవనశైలి బహిరంగ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది.
అయితే టీ తాగితే అందులో ఉండే కెఫిన్ వల్ల టెన్షన్, అలసట వంటి లక్షణాలు తలెత్తుతాయి.
కెఫిన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల నిద్రపై ప్రభావం పడి పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
ఖాళీ కడుపుతో టీ తాగితే అజీర్ణం రావడంతో పాటు రక్తనాళాలను ముడుచుపోయేలా చేస్తుంది.
రోజంతా టీ అధికమొత్తంలో తీసుకోవడం వల్ల మెలటోనిన్ హర్మోన్ విడుదలై మొదడుపై ప్రభావం పడుతుందట.
ఇందులో ఉండే కెఫిన్ తలనొప్పికి కారణమవడంతో పాటు పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది.