ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలు కోల్పోతారా? విస్తుపోయే నిజాలు

ప్రస్తుతం చాలా మంది ఆల్కహాల్‌కు బానిసలయ్యారు. ఏదైనా శుభకార్యాలు అయితే చాలు కొతం మంది మోతాదుకు మించి అధికంగా మద్యాన్ని సేవిస్తుంటారు.
అయితే మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాదకర అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే నట. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఎక్కువగా తాగే వారు సరిగ్గా తినకపోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు లోపం ఏర్పడి ఇమ్మూనిటీ దెబ్బతింటుంది. కాబట్టి పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పరిమితికి మించి మందు తాగడం శరీరానికి కచ్చితంగా ప్రమాదంగా మారుతుంది. ఈ అలవాటు కోలుకోలేని అనారోగ్యాలు, వ్యాధులకు కారణం అవుతుంది. మద్యం ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారణాలలో అధిక మద్యపానం ఒకటి. అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగినప్పుడు ఇలా జరుగుతుంది. కాబట్టి హార్ట్ స్ట్రోక్, సడన్ కార్డియాక్ డెత్, కార్డియోమయోపతి వంటి హార్ట్ ప్రాబ్లమ్స్‌కు దారితీయవచ్చు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు.
ఇది కణాల పెరుగుదలకు దారితీస్తుంది. మద్యపానం కారణంగా అవయవాలు దెబ్బతినే ఎండ్ స్టేజ్ ఆల్కహాలిజం, క్యాన్సర్‌కు కారణం కావచ్చు. కాబట్టి ఎక్కువగా మద్యాన్ని సేవించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఎక్కువగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారికి కాలేయం పనితీరు మందగించి లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో టాక్సిన్స్ పెరిగి పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ముఖ్యంగా మగవారిలో అతిగా మద్యం తాగడం వల్ల సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. దీంతో శృంగారం చేయాలనే కోరికలు తగ్గి సెక్స్‌కు దూరంగా ఉంటారట. ఆ అలవాటుని తగ్గించుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.
అలాగే మద్యాన్ని అధికంగా సేవించడం వల్ల మానసిక, శారీరక సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.