పెదాలు ఎర్రగా కావాలనుకుంటున్నారా..! అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ముఖంలో ఆకర్షణీయంగా కనిపించే మొట్టమొదటి భాగం పెదవులు. కానీ కొంత మందికి పెదవులు నల్లగా కనిపిస్తాయి.
మీ పెదవులు ఎర్రగా, మృదువుగా కావాలి అనుకుంటున్నారా. అయితే.. ఈ చిట్కాలు మీ కోసమే.
చాలా మంది పొడి పెదవులతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి నూనెతో పెదవులపై మసాజ్ చేసుకుంటే వాటిపై ఉండే నల్లటి మచ్చలు పోయి.. పెదవులు మృదువుగా మారతాయి.
తేనేలో యాంటీ అలర్జీ గుణాలు ఉంటాయి. కొంచెం తేనేలో నిమ్మరసం కలిపి పెదవులకు అప్లై చేసుకుని తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే పెదవులు ఎర్రగా మారతాయి.
దోసకాయ రసంలో యాంటీఆక్సిడెంట్లు, సిలికా వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసం పెదవులపై అప్లై చేస్తే.. నల్లటి మచ్చలు పోవడంతో పాటు ఎర్రగా తయారవుతాయి.
నువ్వుల నూనెలో ఉండే సెసామోల్ అనే ఆమ్లం.. మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పెదాలను మృదువుగా, ఎర్రగా మార్చడంలో నువ్వెల నూనె మంచిగా ఉపయోగపడుతుంది.
గులాబీ రేకులను సాధారణంగా బ్యూటీ టిప్స్‌ తయారీలో ఉపయోగిస్తారు. ఈ గులాబీ రేకులు పెదాలు ఎరుపుగా వచ్చేందుకు కూడా వినియోగించుకోవచ్చు. దీన్ని తేనెతో కలిపి రాసుకుంటే పెదాలకు తేమ అందడంతో.. పెదాలు అందంగా తయారవుతాయి.
చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించే పదార్థాల్లో కలబంద ఒకటి. అలోయిన్ అనే పదార్థం అలోవెరా జెల్‌లో ఉంటుంది. పెదాలపై ఉన్న డార్క్ కలర్‌ను పోగొట్టి పెదాలను మృదువుగా మారుస్తుంది. కాబట్టి, అలోవెరా జెల్‌ను రోజూ 1-2 సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
నోట్: పైన తెలిపిన వివరాలు నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా ప్రచురించినవి మాత్రమే.