మానసిక ఆరోగ్యం, మంచి నిద్ర కావాలి అనుకుంటున్నారా..? అయితే ఇవి ఫాలో అవ్వండి
నేటి కాలంలో చాలా మంది ఉద్యోగాలు చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటున్నారు.
దీని వల్ల మానసికంగా దెబ్బ తినడంతో పాటు.. ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.
కాబట్టి.. మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం.
మెరుగైన మానసిక ఆరోగ్యం, నిద్ర కోసం పని-జీవిత సమతుల్యతను కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. అవేంటంటే..
ప్రతి రోజు మార్నింగ్ వాక్‌తో పాటు.. వ్యాయామానికి ఒక గంట కేటాయించండి. దీంతో శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలై మీ మూడ్‌ను మంచిగా చేస్తుంది.
పని చేసుకునే సమయంలో మధ్యలో కాస్త బ్రేక్ తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఒత్తిడి స్థాయిలు తగ్గి.. మీ దృష్టిని సులభతరం చేస్తుంది.
రాత్రి సమయంలో చల్లని లేదా వేడి నీళ్లతో స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది. రాత్రి టైంలో స్క్రీన్ ఎక్కువగా చూడకూడదు. టైంకి పడుకున్నట్లయితే మార్నింగ్ లేవగానో ఎంతో ఫ్రెస్‌గా సంతోషంగా ఉంటారు.
జంక్ ఫుడ్‌ను తినడం ఎవైడ్ చేసి పోషకాహారాలు తీపుకుంటే ఆరోగ్యానికి మంచిది. విటమిన్ లోపాలు మానసిక స్థితి, శక్తి స్థాయిలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల విటమిన్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి.
మన ఆసక్తికి సంబంధించిన విషయాలు కూడా మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయి. ఏదైనా కొత్తగా విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. దీని ద్వారా మీ మెదడు పనితీరు మెరుగు పడుతుంది.