వర్షాకాలంలో యోని ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారా..! అయితే ఈ చిట్కాలు పాటించండి..

వర్షాకాలం వచ్చిందంటే అనేక జబ్బులు వెంటాడుతుంటాయి. అందులో ముఖ్యంగా మహిళల్లో యూరినరీ ట్రారకటక ఇన్ఫెక్షన్‌తో సహా వివిధ యోని ఇన్ఫెక్ష‌న్‌లకు ఎక్కువగా గురవుతారు.
అయితే వర్షాకాలంలో జననేంద్రియ ప్రాంతాన్ని ప్రభావితం చేసే బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణమైనప్పటికీ వాటి నివారణ చర్యలు కూడా ఉన్నాయి. దాని కోసం మీకు చెయ్యాల్సింది ఏంటంటే..?
వ్యక్తి గత పరిశుభ్రత చాలా అవసరం. మీ ప్రైవేట్ ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో రోజుకు రెండు సార్లు అయిన శుభ్రపరుచుకోవాలి.
యోని ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ముఖ్యంగా కాటన్ లోదుస్తులు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. బిగుతుగా ఉండే లోదుస్తులు వేసుకోవడం కారణంగా.. గాలి ప్రవాహాన్ని తగ్గించి, చికాకు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాటన్ బట్టలు ఉపయోగించాలి.
మూత్ర విసర్జన తర్వాత ఖచ్చితంగా జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రపరుచుకోవాలి. నీటిగా తుడుచుకుని పొడిగా ఉంచుకోవాలి. చాలా మంది మూత్ర విసర్జన తర్వాత శుభపరుచుకునేందుకు నిర్లక్ష్యం వహిస్తారు. అది చాలా ప్రమాదకరం.
పిరియడ్స్ సమయంలో ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి శానిటరీ ప్యాడ్‌లను, ప్రతి రెండు గంటలకు టాంపాన్‌లను మార్చకోవడం మంచిది. లేదంటే సాధారణంగా ప్యాడ్‌లో తేమ పెరిగి దద్దుర్లకు కారణం అవుతుంది.
వర్షాకాలంలో మన శరీరం నుండి ఎక్కువగా నీరు, లవణాలు పోతాయి. దీని కారణంగా జననేంద్రియ ప్రాంతంలో చికాకు, మంట వచ్చే అనుభూతికి దారితీస్తుంది. కాబట్టి మీరు ప్రతీ రోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవాలి.
గమనిక: భార్యాభర్తల కలయిక సమయంలో, లేదా ఇల ఇన్ఫెక్షన్ల కారణంగా యోని వద్ద దురద, దద్దుర్లు, మంట లాంటివి అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం మంచిది.