పగటి పూట అతిగా నిద్ర పోతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

మనిషికి ఆరోగ్యం సరైన నిద్రతోనే వస్తుంది. ఒక వ్యక్తికి సగటున 7-8 గంటలు నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.
కానీ.. కొంత మంది అవసరానికి ఎక్కువ, తక్కువ నిద్ర పోయేవారు ఉంటారు. నిద్ర తక్కువైన, ఎక్కువైన ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా..
అయితే.. అవసరానికి మించి పొద్దుట సమయంలో చాలా మంది పడుకుంటారు. దీని కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..!
పగటి పూట ఎక్కువగా నిద్ర పోవడాన్ని హైపర్సోమ్రియా అంటారు. అంటే ఈ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా నిద్రపోతుంటారట.
అతిగా నిద్ర పోవడం కారణంగా రోజు వారి చేసే పనులు సైతం వాయిదా పడతాయి.
అలాగే రోజు అంతా వీళ్లకు ఎంతో బద్దకంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్లు ఎక్కువ సమయం నిద్ర పోవడానికే ఇష్టపడతారు కాబట్టి.
అయితే.. నిద్రలేమి సమస్యకు, హైపర్సోమ్నియా సమస్యకు చాలా తేడా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.