ప్రతి ఒక్కరు తమ కోరిక తీర్చమని గుడికి వెళ్లి దేవున్ని ప్రార్థిస్తారు.

అయితే గుడికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులు, నియమాలు పాటించాలంటారు పెద్దలు.
అంతే కాకుండా దేవుడి దర్శనం అయ్యాక తప్పకుండా 2నిమిషాలైన గుళ్లో కూర్చొని రమ్మంటారు.
కాగా, దర్శనం అయ్యాక గుడిలో ఎందుకు కూర్చోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుళ్లో ప్రశాంతత ఉంటుంది. దేవుడిని దర్శనం నుంచి చేసుకోగానే మనలో కోపం అహం ఆవేశం స్వార్థం కాసేపు దూరం అవుతాయి.
ఒకవేళ వెంటనే మనం బయటకు వెళ్ళిపోతే, ఆ ప్రశాంతత ఉండదు అదే కొంచెం సేపు మనం ఆలయంలో కూర్చుంటే ప్రశాంతత కలుగుతుంది.
అంతే కాకుండా గుడిలో కూర్చొవడం వలన ధ్యాసంత దేవుడి మీదే ఉండి ప్రశాంతంగా గడుపుతాం
అందుకే పెద్దలు కాసేపు గుడిలో కూర్చొని రావాలంటారు.