కాళ్లకు బంగారు పట్టీలు ఎందుకు పెట్టుకోరో తెలుసా?

అప్పట్లో ప్రతి ఒక్కరూ వెండీ పట్టీలు పదాలకు పెట్టుకుని ఇంట్లో నడుస్తుంటే సాక్షాత్తూ మహాలక్షీ దేవి ఇంట్లో కొలువైనట్లుగా ఉండేది.
భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళల ఆభరణాల్లో పట్టీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ మధ్యకాలంలో కొంతమంది తమ సంపదను తెలియజేయడానికి పాదాలకు బంగారు పట్టీలు పెట్టుకుంటున్నారు. కానీ సైన్స్ పరంగా ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు.
లక్ష్మీ దేవికి పసుపు రంగు అంటే ఎంతగానో ఇష్టం. ఆమెకు ప్రీతిపాదమైన పుత్తడితో పట్టీలు చేయించుకుని కాళ్లకు ధరించడం దేవతను అవమానించినట్లవుతుంది.
కాబట్టి వెండి పట్టీలే ధరించాలి. వీటి వల్ల ఎన్నో లాభాలున్నాయి కూడా. ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.
నడుము నొప్పి, మోకాలి నొప్పి, హిస్టీరియా వంటి ప్రబ్లమ్స్ రాకుండా ఉంటాయి.
రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. పాదాలు వాపు రాకుండా ఉంటాయి.
మెదడు పనితీరు మెరుగుపడి.. స్ట్రెస్ నుంచి రిలీఫ్‌ను ఇస్తాయి. గోల్డ్ అయితే అధికంగా వేడిని పుట్టిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఈ కారణాల వల్ల బంగారాన్ని కేవలం మెడ, చేతులకు మాత్రమే ధరించాలని నిపుణులు చెబుతున్నారు.