ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు, అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి.
అయితే వేసవి తర్వాత ఒక్కసారిగా ఈ మాసంలో వాతావరణం మారిపోయి, చల్లగా మారుతుంది.
కానీ మన శరీరంలో వేడి అలానే ఉంటుంది. అయితే వేడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు పెద్దలు.
అలాగే ఆషాడ మాసంలో కొత్తపెళ్లి కూతుర్లు పుట్టింటికి వస్తుంటారు.
తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది.
పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.
వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందంట