మృగశిర కార్తె రోజున చేపలు ఎందుకు తింటారో తెలుసా?

మృగశిర కార్తె ప్రారంభమైంది, ఈరోజు ఎవరింట్లోనైనా చేపల కర్రీనే కనిపిస్తూ ఉంటుంది
మన పెద్దలు చెబుతుంటారు, ఈ రోజున తప్పని సరిగా చేపలు తినాలని.
కాగా, మృగశిర రోజు చేపలు ఎందుగు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మృగ శిర కార్తెలో చేపలను తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందంట.
ఎండలు వెళ్లిపోయి..వానలతో పాటు చల్లని వాతావరణం మృగశిర కార్తె మోసుకొస్తుంది.
వాతావరణం చల్లబడడంతో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటుంటారు.
ఈ సీజన్‌లో మానవులలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు వచ్చి, శ్వాస సంబంధ వ్యాధులు వస్తుంటాయి, వాటి నుంచి బయట పడటానికి చేపలు తింటారు.