తెలంగాణలో వ్యక్తి చనిపోతే పిండం పెట్టడం, పిట్టకు పెట్టడం చేస్తారు.

కొన్ని సార్లు పిండాన్ని కాకి ముట్టదు.
అయితే పిండాన్ని కాకిముట్టకపోతే ఏం జరుగుతుంది, కాకే పిండం ఎందుకు ముట్టాలో ఇప్పుడు చూద్దాం.
గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి ఆ* ప్రేతాత్మగా మారి పక్షి రూపంలో ఇంటి చుట్టే తిరుగుతుందట.
అందుకోసం 3వ,5వ, 11వ రోజు తర్వాత చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి, స్మశాన వాటిక వద్దకు వెళ్లి మొక్కుతారు.
అలా మొక్కడం వల్ల పక్షి రూపంలో ఆత్మ వచ్చి రుచి చూసి వెళ్తుందని దాని ఫలితంగా అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు.
ఒకవేళ పక్షి ముట్టకపోతే ఏదో ఒక లోపం కలుగుతుందని, అరిష్టం ఏర్పడుతుందని తప్పనిసరిగా కాకి ముట్టాలని ప్రజలు కోరుకుంటారు.
అంతే కాకుండా పిండం కాకి ముట్టకపోతే ఆత్మశాంతించలేదని, అది మంచిది కాదని అంటారు.