నవరాత్రుల్లో ఏ వస్తువులు దానంగా ఇస్తే మంచిదో తెలుసా?

ఈ ఏడాది శరన్నవరాత్రి అక్టోబర్ 15న మొదలయ్యాయి. ఇవి 24న తేదీ వరకు కొనసాగుతాయి. నవరాత్రి రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి శక్తిని పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మంచిదని పెద్దల నమ్మకం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. అందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ మాల వేసుకుంటారు. అలాంటి వారికి ఎరుపు రంగు గాజులు, లేదా కంకణాలను దానంగా ఇవ్వడం వల్ల కుటుంబమంతా సంతోషంగా ఉంటారట.
అలాగే అమ్మవారికి ప్రసాదంగా పెట్టిన అరటి పండ్లను దానం చేస్తే ఇంట్లో సంపద పెరుగుతుందట.
నవరాత్రులు తొమ్మిది రోజులలో పుస్తకాలను దానం చేసే మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందుతారు.
అలాగే దేవత విగ్రహం ఇతరుల చేత దానంగా తీసుకుని పూజించడం వల్ల సుఖ సంతోషాలను పొందుతారట.
ఈ 9 రోజులలో వెండి వస్తువులు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో ఏదైనా వెండి వస్తువును కొనుగోలు చేయడం లేదా దానంగా ఇవ్వడం చాలా మంచిదట. అంతేకాకుండా దేవుడి దగ్గర వెలిగించే దీపాన్ని దానంగా ఇస్తే వివిధ సమస్యల నుంచి బయటపడతారని భక్తుల నమ్మకం.