ఏ రాశిలో పుట్టిన వారికి ఎలాంటి ముఖద్వారం ఉన్న ఇల్లు ధనలక్ష్మిని కలిగిస్తుందో తెలుసా?
తెలుగువారు ఏ కార్యక్రమం చేయాలన్నా.. కొత్త ఇల్లు కట్టాలన్నా వాస్తును కచ్చితంగా పాటిస్తారు. జాతకంలో ఉండేదాన్ని బట్టి ఏదైనా కలిసి వస్తుందని అంటుంటారు. అయితే ఏ రాశి వారికి ఎలాంటి ఇల్లు కలిసి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశిలో పుట్టిన వారికి తూర్పు ముఖద్వారం గల ఇల్లు బాగా కలిసి వస్తుందట.
వృషభ రాశి: ఇందులో పుట్టిన వారికి దక్షిణ సైడ్‌లో ఉన్న గడప గల ఇల్లు జీవితాన్ని సుఖమయం చేస్తుంది.
మిధున రాశి: రాశిలో జన్మించిన వారికి పశ్చిమ వైపు గల ముఖద్వారం కలిగి ఉంటే ధనలక్ష్మి తలుపు తడుతుందట.
కర్కాటక రాశి: ఉత్తర గుమ్మం కలిగి ఉంటే ఇంట్లో కలతలు లేకుండా ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
సింహ రాశి: సింహ రాశిలో పుట్టిన వారు ఇంటికి తూర్పు ముఖద్వారం ఉంటేనే అందులో ఉండాలి. లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కన్యా రాశి: కొత్తగా ఇళ్లు కడుతున్నట్లైయితే పశ్చిమ వైపు గడపను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రెంట్‌కు ఉండేవాళ్లు కూడా అలా ఉన్న ఇంట్లోకి వెళ్లడం మంచిది.
తులా రాశి: ఈ రాశి గల వారు దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది.
వృశ్చిక రాశి: ఉత్తర గల గుమ్మం ఉంటే ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రారంభించి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు రాశి: ఇలాంటి వాళ్లు తూర్పు వైపు గల ముఖద్వారం ఉన్న ఇంట్లో జీవించాలి.
మకర రాశి: దక్షిణ గుమ్మం ఇల్లు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా పొందవచ్చు.
కుంభ రాశి: వారికి పశ్చిమ గల గడప అచ్చొస్తుందట. కాబట్టి పండితులను తీసుకొచ్చి వాస్తు చూపించుకోవడం మంచిది.
మీన రాశి: అలాగే ఈ రాశి వారికి ఉత్తరం వైపు ఉన్న ముఖద్వారం ఉండేలా చూసుకోండి.