కరెన్సీ నోట్లపై కనిపించే కట్టడాలు ఎక్కడున్నాయో తెలుసా?

కరెన్సీ నోట్లపై దేశ సాంస్కృతిక, చారిత్క వారసత్వంను పోలి స్మారక చిహ్నాలు, ల్యాండ్ మార్కల చిత్రాలను కలిగి ఉంటాయి.
భారతదేశంలో కరెన్సీ నోట్లపై ముద్రించిన కట్టడాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో ఇక్కడ తెలసుకుందాం.
కోణార్క్‌లోని సూర్య దేవాలయంలో ఉన్న రథం రూ. 10 నోటుపై కరెన్సీ నోటుపై కనిపిస్తాయి. దీనిని 13 శతాబ్దంలో నిర్మించనట్టు సమాచారం.
రూ. 20 కరెన్సీ నోటుపై దేశంలోనే అతిపెద్ద ఆలయం ఎల్లోరాలోని కైలాష్ దేవాలయాన్ని ముద్రించారు.
కర్నాటకలోని పర్యాటక కేంద్రమైన హంపి నుండి చారిత్రాత్మక రాతి రథం ఫ్లోరో‌సెంట్‌ రూ. 50 నోటుపై కనిపిస్తుంది.
రూ. 100 కరెన్సీ నోట్‌పై గుజరాత్‌లోని రాణికీ వావ్ మెట్ల బావిని ముద్రించారు. ఇది 1063లో ఉదయమతి రాణి నిర్మించిందని సమాచారం.
రూ. 200 కరెన్సీ నోటు వెనుక మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ సాంచి స్థూపం ముద్రించబడింది దీనిని క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించారు.
రూ. 500 నోటు వెనుక ఢిల్లీలోని ప్రసిద్ధ, చారిత్రాత్మక ఎర్రకోట ఫొటో ఉంటుంది.
అదేవిధంగా రూ. 2000పై ఓ మైలురాయి సంఘటన ఉటుందట. ఇది అతిపెద్ద భారతీయ డినామినేషన్ నోటు.