ఏప్రిల్ ఫస్ట్ అంటే చాలా మందకి ఇష్టం ఉంటుంది.

ఏప్రిల్ ఫూల్స్ డేను పిల్లలు, పెద్దలు జరుపుకుంటూ నవ్వులు పూయిస్తారు.
ఈ రోజున ప్రజలు పాఠశాల, కళాశాల, ఆఫీసు, ఇళ్లలో ఒకరినొకరు ఫూల్స్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు.
అయితే ఈ ప్రత్యేకమైన రోజు.. ఏప్రిల్ ఫూల్ అనేది ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాం.
ఒక సమాచారం ప్రకారం ఏప్రిల్ ఫూల్‌ను 1381 లో మొదటిసారి జరుపుకున్నారు.ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ II ,బోహేమియా రాణి అన్నే నిశ్చితార్థాన్ని ప్రకటించారు.
వారి నిశ్చితార్థం తేదీని 32 మార్చి 1381గా నిర్ణయించారు. ఈ వార్త విన్న ప్రజలు చాలా సంతోషించి, అందరూ సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.
క్యాలెండర్‌లో మార్చి 32 తేదీ లేదని, అంటే అందరూ మూర్ఖులయ్యారని తరువాత అతను గ్రహించాడు.
అందుకే ఈ కథనం ప్రకారం అప్పటి నుండి ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఫూల్స్ డే జరుపుకోవడం ప్రారంభమైందంట.