అక్షయ తృతీయకు ముందే వీటిన ఇంట్లో నుంచి తొలగించక పోతే ఏం జరుగుతుందో తెలుసా?

అక్షయ తృతీయ ఎంతో విశిష్టమైన పండుగగా భారతీయులు భావిస్తారు. అలాగే బంగారాన్ని కొనుగోలు చేసి నిష్టగా లక్ష్మీ దేవికి పూజలు చేస్తారు.
అయితే అక్షయ తృతీయ రాకముందే ఈ వస్తువులు ఇంట్లో నుండి తొలగించకపోతే దరిద్రం వెంటాడుతుందట.
ఇంట్లో పాడైపోయిన, విరిగిపోయిన చీపుర్లను తొలగించకపోతే లక్ష్మీ దేవికి కోపం వస్తుందట.
తెగిపోయిన చెప్పులు, పాడైపోయిన గిన్నెలను కూడా బయటపారేయ్యాలి. లేదంటే సమస్యల్లో పడతారట.
విరిగిపోయిన ఫొటో ఫ్రేమ్‌లు, చెత్త చెదారం ఉంటే లక్ష్మీ దేవి ఇంట్లో ఉండదట. దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయట.
ఎండిపోయిన మొక్కలను అక్షయతృతీయకు ముందే పీకి పారేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.