దిండు, లేదా టెడ్డీ బేర్‌ను హగ్ చేసుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా?

ఇటీవల చాలా మందికి సాఫ్ట్ టాయిస్‌ను హగ్ చేసుకుని పడుకునే అలవాటు ఉంటుంది.
అయితే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా రూమ్‌లో ఒంటరిగా ఉండేవారు టెడ్డీ బేర్‌ను కౌగిలించుకుని పడుకుంటారు. ఇలా చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
యాంగ్జైటీ గా ఉంటే అది నిద్ర పై ప్రభావం చూపుతుంది. దీంతో సరైన సమయానికి నిద్ర పోకపోతే ఆందోళనను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మృదువైన దిండు, లేదా టెడ్డీబేర్‌ను పట్టుకుని పడుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.
అలాగే రోజూ టెడ్డీబెర్‌ను హత్తుకుని పడుకుంటే ఒత్తిడి తగ్గడంతో పాటు మనస్సు రిలాగ్స్‌గా ఉంటోంది.
ఒంటరిగా నిద్రపోయేవారు టెడ్డీని పట్టుకుని పడుకుంటే ఒంటిరిగా లేరు మీతో పాటు మరొకరు ఉన్నారనే భావన కలుగుతుంది.
కొంత మందికి రాత్రి సమయాల్లో ఏవేవో కలలు వచ్చి బాధపడుతుంటారు. అలాంటి వారు దిండును కౌగిలించుకుని నిద్రించడం మంచిది.
మెత్తని, మృదువైన టెడ్డీబేర్ లేదా దిండును కౌగిలించుకుని పడుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై మనల్ని ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది.