మనుషులు గడ్డి తింటే ఏమౌతుందో తెలుసా? తెరపైకి శాస్త్రీయ వాస్తవాలు!

జంతువులు, పశువులు గడ్డి తినడం కామన్. కానీ మనుషులు గడ్డి ఎందుకు తినకూడదు? తింటే ఏమౌతుందని చాలా మందిలో ఈ ప్రశ్న తలెత్తుతుంది.
అయితే గడ్డి విషపూరితం కాదని తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మానవులు కూడా గడ్డి తినవచ్చు.
జంతువులు గడ్డి తిన్నట్లే మన పూర్వీకులు కూడా గడ్డి తిని జీవించారని అంటారు. కానీ డేర్ గడ్డి మానవులకు ఎక్కువ పోషకాహారాన్ని అందించదట.
మానవులు గడ్డి తిన్నాక, దాన్ని జీర్ణం చేయడం చాలా కష్టమని నిపుణులు వెల్లడించారు.
ఇది లిగ్నిన్ అండ్ సెల్యులోజ్, ఆర్గానిక్ పాలిమర్లు వంటి పదార్థాలను కలిగి ఉంటుంది. వాటిని జీర్ణించుకునే శక్తి జంతువులకు మాత్రమే ఉంటుంది.
మనం తినే కూరగాయలు, పండ్లలో, సెల్యులోజ్, లిగ్నిన్ ఉంటాయి, కానీ వాటిని మన జీర్ణవ్యవస్థకు సరిపోయే పరిమాణంలో మాత్రమే తింటాము.
ఆవులు, మేకలు, గొర్రెలు, జిరాఫీలు వంటి కొన్ని జంతువులు గడ్డిని సౌకర్యవంతంగా జీర్ణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.