వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

ఆకుకూరలు తినడం మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు.
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆకుకూరల్లో ఔషధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియలను మెరుగుపరిచి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అయితే.. వర్షాకాలంలో మాత్రం ఆకుకూరలు తినకుడదని చెబుతున్నారు కొందరు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షకాలంలో ఆకుకూరల్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. వాటి ఆకుల మధ్య పరిశీలించినట్లైతే అధికమొత్తంలో బ్యాక్టీరియా చేరి ఉంటుంది.
ఆకుకూరలు చిత్తడి ప్రాంతంలో పెరుగుతాయి. వీటికి సరైన మొత్తంలో సూర్యకాంతి లభించకపోవడం వల్ల బ్యాక్టీరియా చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది.
చల్లని వాతావరణంలో ఆకుకూరలు ఉంచినప్పుడు అవి చాలా ఫ్రెస్‌గా కనిపిస్తాయి. కాబట్టి అవి నిల్వ ఉంచే చోట తేమ ఎక్కువగా ఉండి ఆకుకూరలు కలుషితం అవుతాయి. దీంతో ఫుడ్ పాయిజన్‌కు దారి తీస్తుంది.
అంతే కాకుండా.. ఆకుకూరలు కలర్ ఫుల్ కనిపించేందుకు కలర్ ఇంజక్షన్ చేస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. పేగులను బలహీనపరుస్తాయి. వీటితో పాటు కిడ్నీలను పాడు చేస్తాయి.
కాబట్టి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలో ఆకుకూరలు తినకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.