ఈ వ్యాధులు ఉన్నవారు చేపలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రస్తుతం ఉన్న జీవన శైలీలో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. టైంకు తినకపోవడం, తినే ఆహారం కల్తీ కావడం వీటికి ప్రధాన కారణం. అందుకే విటమిన్స్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
ఒంట్లో అవయవాలు సరిగా పనిచేయాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ప్రొటీన్లు, కేలరీలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న వాటిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
చేపల్లో ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇది శరీర రక్తంలోని ట్రై-గిసరైడ్‌లను తగ్గించటమే కాకుండా, రక్త పీడనాన్ని, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి.. అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లైనా చేపలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీల పనితీరుకు చేపలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు మనకు ప్రయోజనం కలిగిస్తాయి. రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర పిండాల వ్యాధులు రాకుండా చేస్తాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. 12 దేశాల్లోని 25 వేల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు.
చేపల్లో ఉండే లాంగ్ చెయిన్ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు గుండెకు మేలు చేస్తాయి. దీనివల్ల కిడ్నీల పనితీరులో క్షీణత రాకుండా నిరోధిస్తాయని గుర్తించారు.
కాబట్టి.. కిడ్నీలు, గుండె వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే చేపలు తినడం మంచిదని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.
నోట్: పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు వచ్చిన వైద్యులను సంప్రదించడం మంచిది. పైగా వైద్యులు ఇచ్చిన సలహా మేరకు ఫుడ్ తింటే మంచిది.