మిమ్మల్ని మానసికంగా వీక్ చేసే అలవాట్లు ఏంటో తెలుసా..?
శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో.. మానసిక ఆరోగ్యానికి అంతకు మించిన ప్రాధాన్యతను ఇవ్వాలి.
కానీ, చాలా మంది శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ.. మానసికంగా చాలా వేదన అనుభవిస్తుంటారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి వారికి తక్షణ చికిత్స అవసరమని WHO వెల్లడించింది.
అయితే మనం చేసే కొన్ని నిర్లక్ష్యపు పనులే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..!!
నిద్ర: ప్రశాంతమైన నిద్ర శరీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనిషికి అవసరమైన నిద్ర లేకపోతే అనేక ఒత్తిళ్లకు, అలసటకు, కోపానికి గురై మానసిక సమస్యలు మొదలవుతాయి.
ఆహారం: మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలా కాకుండా జంక్ ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడి.. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లాంటివి ఎదుర్కొంటారు.
పనులు వాయిదా: మనలో చాలా మంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయరు. తర్వాత చేద్దామని వాయిదాలు వేస్తుంటారు. అలాంటి వారికి పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో ఆందోళల పెరిగి డిప్రెషన్‌కు గురవుతారు.
సోషల్ మీడియా: ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కాలం గడిపేస్తున్నారు. గంటల తరపడి ఫోన్లు చూసుకుంటూ ఉండిపోవడంతో ఆరోగ్యంలో మార్పులు వచ్చి కొత్త రకమైన ఒత్తిళ్లకు గురవుతుంటారు.
వ్యాయామం: వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. కానీ, ఈ బిజీ పరుగుల జీవితంలో చాలా మంది వ్యాయామానికి సమయం కేటాయించరు. దీంతో ఒత్తిళ్లు పెరుగుతాయి.