ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలేంటో తెలుసా?
మామూల్‌గా చాలా మంది పూజ చేసిన తర్వాత కర్పూరం వెలిగించి దేవుడికి హారతినిస్తారు.
అయితే కర్పూరం వెలిగించడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయట.
పొద్దున కర్పూరం వెలిగిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే అందరికీ ప్రశాంతంగా అనిపిస్తుంది.
కర్పూరం పొగ వల్ల చిన్న చిన్న క్రిమి కీటకాలు తొలగిపోతాయి. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
కర్పూరం వెలిగించడం తో కండ్ల కలకల సమస్య నుండి కూడా బయటపడవచ్చును.
వీటిని అల్మారాలో, వార్డ్‌రోబ్‌లు పెడితే బట్టలు తాజాగా ఉంటాయి. అలాగే రాత్రిపూట నిద్ర వేళకు ముందు కర్పూరం, లవంగంను కాల్చడం వల్ల గాలిని శుద్ధి చేయడంతోపాటు ఇంట్లో ప్రతికూల శక్తిని దూరం చేయవచ్చు.