ప్రేమ వైఫల్యానికి కారణాలు ఏంటో తెలుసా..?

ప్రతి బంధంలో శారీరక, మానసిక సాన్నిహిత్యం చాలా ముఖ్యమైనది. దాంపత్య జీవితంలో శారీరక ఆప్యాయత లేదా భావోద్వేగ సాన్నిహిత్యం క్షీణించినప్పుడు బంధాలు బలహీన పడతాయి. అవి విడిపోయే వరకు దారి తీస్తాయి.
అయితే.. ప్రేమించడం చాలా ఈజీ. కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రేమికులు, భార్య భర్తలు విడిపోతున్నారు. మరి విడిపోవడానికి అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం.
కమ్యూనికేషన్: ఒక బంధం నిలబడాలి అంటే ముందు కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. భాగస్వాములు లేక, ప్రేమికుల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడంతో అపార్థాలు, విభేదాలు, భావోద్వేగ దూరానికి దారి తీస్తుంది. కాలక్రమేణా బంధాల మధ్య దూరం పెరిగి విడిపోవడానికి దారి తీస్తాయి.
నమ్మకం: భాగస్వాముల మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యమైన అంశం. మన భాగస్వామి పట్ల మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే బంధం మరింత బలపడుతుంది. ప్రతి విషయంలో సపోర్ట్‌గా ఉండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి.
ఇష్టం: దాంపత్య జీవితంలో మీ భాగస్వామి ఇష్టాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. వారి ఇష్టాలకు మీరు విలువ ఇస్తున్నట్లయితే.. మీ మీద ఇష్టం పెరుగుతుంది. అలా కాకుండా తమ ఇష్టాలకు మీకు విలువ ఇవ్వకపోతే భాగాస్వామి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ఇష్టాలను గౌరవించండి.
మాటకు మాట: ప్రతి బంధంలో గొడవలు సహజం. ఒకరు ఒకరు మాట మాట పెంచుకుంటూ పోతే గొడవలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు సర్దుకుపోతే బంధం నిలబడుతోంది.
కూల్‌గా మాట్లాడండి: ఆఫీస్‌లోనే లేక వేరేవేరే కారణాల చేతనో ఒక్కోసారి కోపంలో ఉంటారు. అయితే కోపంలో ఇంట్లో వాళ్లను అనే మాటలకు వాళ్లు బాధపడతారు. వాళ్ల కోపం తగ్గక వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. గొడవలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.