చిత్ర పరిశ్రమలో కొంత మంది నటీనటులు ఈ రంగానికి సూట్ అయ్యే విధంగా పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా పేరు మార్చుకున్న కొందరి నటి నటుల అసలు పేర్లు ఏంటో చుద్దాం.

నయన తార : నయన తార కేరళకు చెందిన దక్షిణ భారతీయ సినిమా నటీమణి. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. తెలుగులో 'లక్ష్మీ', 'బాస్' చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. శ్రీరామరాజ్యం'లో సీతగా నటించిన ఆమె 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులను అందుకుంది.
అనుష్క: బెంగుళూరుకు చెందిన యోగా శిక్షకురాలు అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. బాహుబలి సినిమా ద్వారా భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన సినీతారగా గుర్తింపు తెచ్చుకుంది.
కైరా అద్వానీ: కైరా అద్వానీకి ఆమె తలిదండ్రులు "అలియా అద్వానీ"గా నామకరణం చేశారు. కానీ ఈమె కైరా అద్వానీగా పేరు మార్చుకుంది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన నటించి ఈ బ్యూటీ తెలుగు వారి మెప్పు పొందింది.
శృతి హాసన్: శృతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన నటి, గాయని. ఈమె నటుడైన కమల్ హాసన్ కూతురు. శృతి హాసన్ అసలు పేరు శృతి రాజలక్ష్మీ హాసన్
నాని: నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు. ఆయన సినిమాల్లోకి రాకముందు నవీన్ బాబు ఘంటా అసలు పేరు. అష్టా చమ్మా అనే తెలుగు సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించాడు.
రవితేజ: మాస్ మహరాజ్ రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. 1999లో ‘నీ కోసం’ సినిమాలో రవితేజ తొలిసారిగా హీరోగా చేశాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది.
ధనుష్: ధనుష్ మొదటి చిత్రం తుళ్లువదో ఇలామై , అతని తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించిన 2002 లో విడుదలైన చిత్రం. వెంకటేష్ ప్రభు కస్తూరి రాజాని వృత్తిపరంగా ధనుష్ అని పిలుస్తారు.
విక్రమ్‌ : కెన్నెడీ జాన్ విక్టర్. ఈయన సినిమాల్లో విక్రమ్‌ పేరుతో సుపరిచితుడు. ప్రధానంగా తమిళ సినిమాల్లో పనిచేసే భారతీయ నటుడు.