జీడిపప్పు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరూ తింటుంటారు. ఇందులో ముఖ్యంగా జీడిపప్పు చిన్నా పెద్ద తినడమే కాకుండా ఆహారాల్లో కూడా ఉపయోగిస్తారు.
అయితే జీడిపప్పును ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని క్యాలరీలు ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
అలాగే వీటి వల్ల మధుమేహం, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అలాంటి వారు తినకపోవడం మంచిది.
జీడిపప్పులో మెగ్నీషియం, కాల్షియం ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి.
జీడిపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. మీరు ఎక్కువ ఫైబర్ తిన్న తర్వాత తక్కువ నీరు తాగితే డీహైడ్రేషన్ సంభవించవచ్చు.
ఇందులో ఉండే ఐరన్ అధిక కణాల పని పై ప్రభావం చూపిస్తాయి. దీంతో ఆస్తమా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.