రోజూ 4 వాల్‌నట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

వాల్‌నట్స్‌లో విటమిన్‌ B6, E, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, రాగి, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.
ఇందులో ఉండే ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఏకాగ్రతను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా అల్జీమర్స్‌, డిమెన్షియా వచ్చే అవకాశం తగ్గిస్తాయి.
వాల్‌నట్స్‌లో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫోలిక్‌ యాసిడ్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. రోజూ వాల్‌నట్స్‌ తినడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది.
వాల్‌నట్స్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మేలు చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్‌ కాంపౌండ్స్‌ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్‌ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది ఆకలిని తగ్గించి.. ఫుడ్ తక్కువగా తినేలా చేస్తుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
వాల్‌నట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తినడం ద్వారా ఆర్ర్థరైటిస్‌తో వచ్చే నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి.
వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
వాల్‌నట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తాయి.
అంతే కాకుండా రోజూ వాల్‌నట్స్ తినడం వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిక్స్‌ తగ్గుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.