రోజూ అలోవేరా జ్యూస్ తాగితే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా..?

ప్రకృతిలో లభించే అతి ముఖ్యమైన ఔషధాల్లో కలబంద ఒకటి. దీని జ్యూస్ రోజు పరగడుపునే తాగటం వల్ల అనేక ప్రయోజాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
కలబందలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. రోజూ దీని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
థైరాయిడ్ పేషెంట్లకు కలబంద రసం చాలా ఉపయోగకరం. కలబంద రసంలో తులసి ఆకులు కలిపి తీసుకున్నట్లయితే.. స్థూలకాయం తగ్గి థైరాయిడ్ నియంత్రణ ఉంటుంది.
కలబందలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరం వాపు, మంటను కూడా తగ్గించడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బరువు తగ్గాలి అనుకునేవారికి కలబంద జ్యూస్ ఔషధంలా పనిచేస్తుంది. బాడీ హైడ్రేట్‌గా ఉంటేనే పోషకాలు ఆహారం నుంచి గ్రహించబడతాయి. దీంతో అవాంఛిత ఆహార కోరికలు నియంత్రించబడి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
షూగర్ పేషెంట్లు రోజుకు రెండు స్ఫూన్ల కలబంద రసం తీసుకోవడం వల్ల కర్తంలో చెక్కర స్థాయిలు తగ్గుతాయి.
కలబంద పేగు ఆర్ద్రీకరణను తగ్గిస్తుంది. పెద్ద పేగులో సంకోచాలను ప్రేరేపించి.. మలబద్ధకాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.