మామిడి పండులోని జీడితో ఇలా చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుతం ఎడాకాలం కాబట్టి మార్కెట్‌లో మామిడి కాయలు వీపరీతంగా అందుబాటులో ఉంటాయి. వాటిని కొనుగోలు చేసి ఫ్యామిలీ మొత్తం రకరకాల పదార్థాలు తయారు చేసుకుని తింటుంటారు.
అయితే మామిడి పండ్లను తిని పిక్కలను పనికిరావని పడేస్తుంటారు. కానీ, అందులోని జీడితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జీడిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి రోగాలు రాకుండా కాపాడుతాయి.
జీడితో తయారు చేసిన నూనెలో ఆమ్లాలు, ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉండి జుట్టుకు రాసుకుంటే హెయిర్ రాలకుండా పొడవుగా మారుతుంది.
మామిడికాయ జీడితో పొడి తయారు చేసి రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు వంటివి తగ్గుతాయి.
ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాంటి వారు జీడిని డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మామిడి జీడిని పౌడర్‌లా చేసుకుని రెగ్యూలర్‌గా బ్రష్‌ చేసుకోవటం వల్ల మీ దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మెరిసే దంతాలు మీ సొంతం అవుతాయి.
ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తప్రసరణను పెంచుతుంది.
జీడితో తయారు చేసిన నూనెలో మెత్తగా దంచి టమాటా వేసి రాసుకుంటే ముఖం ఉన్న మొటిమలు, మచ్చలు తొందరగా తగ్గి మిల మిల మెరుస్తారు.