క్రాన్బెర్రీ పండ్లు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలుసా?

క్రాన్బెర్రీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు మానవ శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.
ఈ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. ఇక ఈ పండ్లకు వ్యాధుల్ని, గాయాల్నీ నయం చేసే శక్తి ఎక్కువ. వీటి మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
క్రాన్బెర్రీస్‌లో ఉన్న ఫ్లేవానాయిడ్స్, యాంటీ-ఆక్సిడెంట్ల లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
అధిక బరువుతో బాధపడేవారికి ఈ పండ్లు ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ముందుంటాయి.
విటమిన్లు పుష్కలంగా ఉన్నందున జుట్టు సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పెరుగుదలకు సహాయపడతాయి.
ప్రస్తుతం ఆహార పదార్థాల మార్పుల వల్ల చిన్న వయసులోనే కొంత మంది వృద్ధాప్య ఛాయలతో బాధపడుతున్నారు. అలాంటి వారు క్రాన్బెర్రీస్ తినాలని వైద్యులు చెబుతున్నారు.
క్రాన్బెర్రీలో ఉండే ఫైబర్ ఊబకాయాన్ని తగ్గించి మంచి ఫలితాన్ని కలిగేలా చేస్తాయి.
ప్రోయాంథోసైనిడిన్స్ ఉండే క్రాన్బెర్రీ జ్యూస్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. దీంతో రొమ్ము క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి.
వీటిని తరచూ తినడం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలా అని మొతాదుకు మించి తినకూడదు.