ఉసిరికాయ పచ్చడి, మామిడి పచ్చడి, నిమ్మకాయ, క్యాబేజీ, క్యారెట్, ముల్లంగి కాకరకాయలను చాలా మంది కాలంతో సంబంధం లేకుండా వీటిని పచ్చడి పెడుతుంటారు.
ఓ కూర ఉన్నా సరే ఊరగాయ ముక్క ఉండాల్సిందే. అందుకే చాలా మంది ఊరగాయలను రెగ్యులర్ గా తింటుంటారు. కానీ అలా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఊరగాయ పెట్టడానికి కూరగాయలను వాటిల్లోని నీరంతా పోయేదాక ఎండలో ఎండబెడతారు. అలా చేస్తే ఇందులోని పోషకాలు పోయి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
అలాగే కొంత మంది ఉప్పు కలిపి కొన్ని రోజుల పాటు సీసాలో పెట్టి స్టోర్ చేస్తారు. ఆ తర్వాత పచ్చడి పెడతారు. వీటిని తింటే రక్తపోటు అమాంతం పెరుగుతుంది.
ఊరగాయలో 569 మిల్లీ గ్రాముల సోడియం కంటెంట్ ఉంటుంది. ఇది తినడం వల్ల కడుపు ఉబ్బరం, మూత్రపిండాలపై పనిభారం పెరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇందులో అష్టమి ప్రిడ్ కార్బన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఊరగాయ పెట్టాలంటే కొందరు కూరగాయలను నూనెలో వేయించి తయారు చేస్తారు. అలా చేసిన దానిని తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
అధిక బరువు ఉన్నవారు, ఆవకాయ లోని నూనెను తినకుండా, కేవలం మామిడి ముక్కలతోనే సరిపెట్టుకోవాలి.
ఊరగాయలు మితంగా మాత్రమే తినాలి. లేదంటే ఇది కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.