భోజనం చేసిన తర్వాత నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతున్నారు. దానికి కారణం మనం తీసుకున్న ఆహారమే
ఈ బిజీ లైఫ్‌లో టైంకి తినరు. మంచి ఫుడ్ తీసుకోరు. అదే విధంగా తిన్నాక కొంచెం సేపు వాకింగ్ చెయ్యరు. దీంతో అనారోగ్యాల భారిన పడుతుంటారు.
చాలా మంది భోజనం చేయగానే పడుకుండిపోతారు. లేదా అలాగే కూర్చుంటారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
అసలు తినగానే కొంచెం సేపు నడిస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా.. అలా నడవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
భోజనం చేయగానే కొంచెం సేపు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అల్సర్లు, గుండెల్లో మంట, మలబద్దకం, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని చెబుతున్నారు నిపుణులు.
డయాబెటిక్ పేషేంట్లు భోజనం తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుందని నిపుణులు తెలిపారు.
ముఖ్యంగా రాత్రి సమయంలో తిన్న వెంటనే పడుకోకుండా నడిచినట్లుయితే అధిక బరువు సమస్య తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
నోట్: పైన చెప్పబడినవి మీ అవగాహన కోసమే. ఆరోగ్యం పరంగా ఏ సమస్య వచ్చిన డాక్టర్లను సంప్రదించడం మంచిది.