మ్యూజిక్ వినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా.. అలాగే ఏం టైంలో ఏ పాటలు వినాలంటే..?

చాలా మందికి మ్యూజిక్ వినడం అనేది ఒక మంది ఔషధంగా పని చేస్తుంది. మనసు ఎలా ఉన్నా కూడా చాలా వరకు రిలాక్స్ అవుతారు.
మ్యూజిక్ వినడం వల్ల మనసు రిలాక్స్ అవ్వడమే కాకుండా.. దీని వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం.
బాగా ఒత్తిడికి గురైనప్పుడు విచారకరమైన మ్యూజిక్ వింటే.. ఒత్తిడి తగ్గించడంతో సహాయపడుతుంది. అలాగే సంతోషంలో ఉన్నప్పుడు పాటను ఎంజాయ్ చేస్తే.. బాధలో ఉన్నప్పుడు లిరిక్స్ ని అర్థం చేసుకుంటారు.
మ్యూజిక్‌లో కొన్ని అర్థాలు, భావాలు మన సమస్యలను మనమే విన్నట్లు ఉంటుంది. అలాంటి సమయంలో మన జీవితంపై మనకు హోప్ వచ్చేలా చేస్తుంది మ్యూజిక్.
అలాగే.. కొన్ని సాంగ్స్ విన్నప్పుడు కొందరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తుంది. ఇలా మన జీవితాల్లో కనుమరుగైపోయిన వ్యక్తులను మనకు గుర్తు చేసి మంచి భావన కలిగేలా చేస్తాయి. కొన్ని సార్లు బాధను కూడా ఇస్తాయి.
కొన్ని పరిశోధనల ప్రకారం విచారకర మ్యూజిక్ వినేవారికి కాస్తా బాధని దూరం చేస్తుంది. అంతే కాకుండా సంగీతాన్ని వినడం వల్ల విచారా అనుకరణ ప్రోలాక్టిన్‌ని రిలీజ్ చేసేలా చేస్తాయి. ఈ హార్మోన్ విచారాన్ని దూరం చేస్తుంది.
కొంత మంది సాడ్ మ్యూజిక్ వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్లకు మ్యూజిక్ ద్వారా సానుభూతి దొరికినట్లు అవుతుంది.
చాలా మంది.. డిప్రె షన్‌ను తగ్గించుకునేందుకు కూడా సాంగ్స్ వింటారు. అయితే ప్రతిసారి డిప్రెషన్ కూడా మంచిది అంటున్నారు నిపుణులు.
గమనిక.. పైన తెలిపిన అంశాలు ఇంటర్నెట్, కొంత మంది నిపుణులు ఆధారంగా ప్రచురించినవి మాత్రమే. హెల్త్‌కి సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే వైద్యుడుని సంప్రదించడం మంచిది.