ఉదయాన్నే ఈ ఐదు ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు.
ఎన్ని మందులు వాడుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం కలగడం లేదు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
అయితే.. రోజూ ఉదయాన్నే ఈ ఐదు రకాల ఆకులు తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు.
తమలపాకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో యాసిడ్ తగ్గించండలో ఉపయోగపడటమే కాకుండా.. కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహకరిస్తుందట.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో పేరుకుపోయిన మురికి యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా తొలగిస్తుంది. దాంతో పాటు.. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది.
పుదీనా ఆకు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, ఫోలేట్ లాంటి ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంది. పుదీనాలో రక్తపు మలినాలను తొలగించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది తినడం ద్వారా మూత్రం నుంచి ప్యూరిన్లు బయటకు పోతాయి.
కొత్తిమీరలో కాల్షియం, పొటాషియం, థయామిన్, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ కె వంటి గుణాలు ఉన్నాయి. ఇది రక్తంలోని క్రియాటినిన్ స్థాయిని, యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది.
బే ఆకుల్లో యూరిక్ యాసిడ్‌ను క్లియర్ చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్‌ లక్షణాలు ఉంటాయి. ఈ ఆకులను టీగా తయారు చేసుకుని తాగితే.. మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
నోట్: పైన తెలిపిన అంశాలు ఇంటర్నెట్ ఆధారంగా.. పలువురు నిపుణులు సూచనల మేరకు ప్రచురించినవి మాత్రమే. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య వచ్చినా మొదట డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.