మామిడి పండ్లను తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

ఎండాకాలం మార్కెట్లలో ఎక్కువగా అందుబాటులో ఉండే మామిడి పండ్లను తింటే వేడికి అనారోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటుంటారు.
కానీ, మామిడి పండ్లను మోతాదుగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పండ్లలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి గుండె జబ్బులు రాకుండా ఉంటుంది.
మామిడి పండ్లలో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉంటాయి కాబట్టి వీటిని తింటే కళ్లకు మేలు జరుగుతుంది.
మామిడిలో ఉండే పాలీఫెనాల్స్ పలు రకాల క్యాన్సర్ల నుండి రక్షించుకోవచ్చు.
మామిడి పండ్లను డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది.
పెద్దప్రేగు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి మామిడి పండ్లతో మంచి ఫలితం ఉంటుంది.