పనస విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

పనస తొనలు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిన విషయమే. దీంతో వాటిని తిని లోపల ఉండే గింజలు పడేస్తుంటారు.
అయితే పనస గింజలు కూడా మంచి లాభాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొంత మంది పనస గింజలను డైరెక్ట్‌గా తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు వాటితో పలు రకాల కూరలు తయారుచేసుకుని తినవచ్చు.
పనస గింజల్లో మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఐరన్, కాల్షియం, కాపర్, మినరల్స్ ఉండి శరీరానికి మంచి ఫలితాలను కలిగిస్తాయి.
అలాగే ఇందులో ఉండే మైక్రో న్యూట్రియెంట్స్, ప్రోటీన్స్ మానసిక ఒత్తిడి తగ్గించి సంతోషంగా ఉండేలా చేస్తాయి.
మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి పనస విత్తనాలు మంచి ఎంపిక. కాబట్టి పనస తొనలు తిన్నాక గింజలు పడేయకుండా భద్రపరచుకోవడం బెటర్.
ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ సెల్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. వాటిని ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డ్యామేజ్ చేసి క్యాన్సర్ రాకుండా చేస్తాయి.
ప్రస్తుతం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుండె పోటుతో ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పనస గింజలు తినాలి.