చిల్గోజా గింజలను తినడం వల్ల కలిగే లాభాలెన్నో తెలుసా?

చిల్గోజా గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
చిల్గోజా గింజలను పొడి చేసి అందులో బియ్యం పొడి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఈ గింజలను ప్రతి రోజూ తింటే జుట్టు రాలకుండా ఒత్తుగా అవుతుంది.
వీటిల్లో ఉండే యాసిడ్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
చిల్గోజ గింజలను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మతి మరుపు వంటి సమస్యలు తగ్గుతాయి.
కాటెచిన్, లూటిన్, లైకోపీన్, కెరోటినాయిడ్స్, టోకోఫెరాల్ వంటివి ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రోజుకు మూడు చిల్గోజ గింజలు తీసుకోవడం వల్ల జలుబు, పలు రకాల వైరస్‌లు దరిచేరకుండా ఉంటాయి.
చిల్గోజ గింజల పొడిలో తేనె కలిపి తింటే దగ్గు, ఉబ్బసం వంటి వాటి నుండి ఉపశమనం పొందవచ్చు.
పిల్లలకు కూడా వీటిని తినిపంచవచ్చట. అలాగే పెద్దవారు ఈ నూనెను కీళ్ల నొప్పులు ఉన్న చోట రాసుకుంటే మంచిది.