సాధారణంగా ఎవ్వరైనా సరే అన్నం వార్చిన తర్వాత గంజినీ పారబోస్తుంటారు.
కానీ గంజిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉప్పు, నిమ్మరసం కలిపి పూర్వకాలంలో తాగేవాళ్లు. అందుకే వారు స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురించిన 2021 అధ్యయనంలో గంజిలో స్టార్చ్ ఉంటుందని వెల్లడైంది. కాగా ఇది తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు.
గంజిలోని పిండిపదార్థం జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతోన్న వారికి ఎంతో మేలు చేస్తుంది.
హైడ్రేషన్‌ను అలసటను నివారిస్తుంది.
గంజి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. గంజిని ఎన్నో దేశాల్లో బ్యూటీ కేర్‌లో యూజ్ చేస్తారు.
నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు రోజుకోక గ్లాస్ గంజి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో వెయిట్ లాస్ అవ్వడానికీ ఛాన్స్ ఉంటుంది.
అలాగు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది.