చలికాలంలో ఈ టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

చలికాలం వచ్చిందంటే చాలు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి.. చాలా మంది రోగాల బారిన పడుతుంటారు.
వాతావరణంలో మార్పు, పొగమంచు, చల్ల గాలి కారణంగా జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం లాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతుంటారు.
ఈ పొగ మంచు కారణంగా ఉబ్బసం, ఆస్తమ ఉన్నవారికి కఫం బాగా పెరిగిపోయి.. తినడానికి, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
ఈ జబ్బులు నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాల టీ బాగా సహాయ పడుతుంది.
ఆయుర్వేదంలో లవంగాలను అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంలా ఉపయోగిస్తారు. కాబట్టి లవంగాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల కఫాన్ని తగ్గించుకోవచ్చు
లవంగాల టీలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో జలుబు, దగ్గు, జ్వరం వంటివి తగ్గించడంలో ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతే కాదు శీతాకాలంలో కాకర కాయలతో చేసిన వంటకాలు తినడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే కాకరకాయలో కఫాన్ని విరిచే శక్తి ఉంటుంది.
లవంగాల టీ తయారీ విధానం : రెండు కప్పుల నీళ్లు మరిగిన తర్వాత అందులో చిన్న అల్లం, దాల్చిన ముక్క చిన్నది, మూడు నాలుగు లవంగాలు వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత వడకట్టి అందులో కొంచెం తేనె వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.