పెరుగులో ఎండుద్రాక్ష కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా?

విటమిన్ ఎ, ఇ, సి, బి2, బి12 కెరోనాయిడ్స్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష, పెరుగు శరీరానికి వ్యాపించే ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
ఈ రెండు కలిపి తినడం వల్ల పురుషుల వీర్యకణాల నాణ్యత మెరుగుపడుతుందని తాజాగా ఓ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇనుము, పొటాషియం, కాల్షియం, ఫైబర్‌తో కూడుకున్న పెరుగు, ద్రాక్ష మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
అత్యధికంగా కొవ్వు కలిగిన గోరు వెచ్చని పాలల్లో రెండు ద్రాక్షలు, కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేయండి.
ఇలా కలిపి పెట్టిన 6 గంటల తర్వాత ఆ పదార్థం మొత్తం పెరుగుగా మారి.. గట్టిపడుతుంది.
ఇంట్లో రెడీ చేసిన ఈ మిశ్రమం రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యూజ్ అయ్యే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది.
ఇది ఎముకలను స్ట్రాంగ్ చేయడంలో ఎంతో ప్రభావం చూపుతుంది. రక్తపోటు సమస్యను నివారిస్తుంది.
కీళ్ల వాపులతో బాధపడుతున్నవారు ఈ మిశ్రమాన్ని తింటే సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.