బతుకమ్మ పూలల్లోనూ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని తెలుసా..?
బంతి, చామంతులు : బంతి, చామంతి పూలల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, పెస్ట్ రెపల్లెంట్‌గా పని చేస్తాయి. పాదాలు, కళ్లు, నోరు, చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు బెస్ట్ మెడిసిన్ గా ఉపయోగపడతాయి.
గుమ్మడి పూలు :గుమ్మడి పువ్వుల్లో విటమిన్ ఏ, సీలు ఎక్కువగా ఉంటాయి. ఇది వృద్ధాప్యంలో వచ్చే నొప్పుల నుంచి కాపాడుతుంది. ప్రోస్టేట్ గ్రంధి ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
తంగేడు పూలు : మలబద్ధకం, మూత్ర నాళ సమస్యలు, డయాబెటీస్, నెలసరి సరిగ్గా రాని స్త్రీలు దీన్ని మందుగా వాడటం వల్ల ఈ సమస్య నుండి బయట పడుతారు. కీళ్ల నొప్పులకూ దీన్ని మందుగా వాడతారు. దీన్ని కషాయంగా చేసుకుని తాగడం వల్ల శరీరానికి చల్లదనం వస్తుంది.
గునుగు పూలు : గునుగు పూలు, ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ సమస్యలు ఉన్న వారు ఈ పేస్ట్‌ని లేపనంలా చేసుకోవచ్చు. మలబద్ధకం, రక్తహీనత, హైబీపీ ఉన్న వారు వీటిని వండుకుని తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.
సీతమ్మవారి జడగంటల పూలు : సీతమ్మవారి జడగంటల పూలను సెలోసియా పూలనీ అంటారు. దృష్టి లోపాలకు ఇవి మందులా పని చేస్తాయి. కళ్లు ఎర్రగా మారడం, గ్లూకోమా, క్యాటరాక్ట్‌లు, హై బీపీ.. తదితర జబ్బులకు ఇది ఔషధంగా పని చేస్తుంది.