సాధారణంగా పొద్దున లేచిన వెంటనే చాలా మంది మహిళలు ఇల్లంతా శుభ్రం చేసి పూజ చేసి దేవుడికి కొబ్బరికాయ కొడుతుంటారు.
అయితే ఎంతో ప్రత్యేకమైన కొబ్బరికాయను మహిళలు కొడితే అరిష్టం జరుతుందని పురాణాలు చెబుతున్నాయి.
స్త్రీలు పిల్లలకు జన్మనిస్తారు కాబట్టి కొబ్బరికాయ కొడితే కన్నబిడ్డలకు కష్టాలు వస్తాయని నమ్ముతారట.
అప్పట్లో విష్ణుమూర్తి భూమిపై అవతరించినప్పుడు లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టును కూడా తీసుకువచ్చాడట. కాబట్టి ఆమె తప్ప మరొక మహిళ కొబ్బరికాయ కొట్టకూడదని ఆయన షరతు పెట్టినట్లు సమాచారం.
మహిళల కంటే పురుషులకు ఎక్కువ శక్తి ఉంటుందని పూర్వికులు నమ్మేవారు. అందుకే కొబ్బరికాయలను పురుషులే కొట్టాలని భావించేవారట.
ప్రస్తుతం జనరేషన్ మారింది. స్త్రీ, పురుషులు సమానం అని కొన్ని విషయాల్లో తేలిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లలతో కూడా కొబ్బరికాయను కొట్టిస్తున్నారు.
చాలా మంది దేవుడు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతూ నిత్యం పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా కొబ్బరికాయను కచ్చితంగా కొడతారు. మరికొంత మంది మాత్రం అసలు దేవుడే లేడు అన్నట్లు మాట్లాడుతుంటారు.