పుష్కలంగా ప్రోటీన్లు ఉన్న గుడ్లు మంచి పౌష్టికరమైన ఆహారం.
మధ్యస్థ గుడ్డులో 6 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షించడానికి అవసరమైన ప్రతిరోధకాలను తయారు చేయడానికి ప్రోటీన్లను శరీరం ఉపయోగిస్తుంది.
దీనితో పాటు గుడ్లు తినడం వల్ల కండరాల బలహీనత తగ్గుతుంది.
బ్యాచిలర్స్ ఫెవరెట్ కర్రీ అంటే ఎగ్ కర్రీనే. అయితే కొన్నిసార్లు ఎగ్స్ పాడై ఉంటాయి. వాటిని చాలా మంది గుర్తించరు.
పాడైపోయిన గుడ్లను గుర్తించడానికి.. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో గుడ్లు వేయండి.
గుడ్లు అడుగున చేరితే అవి తాజావి అని గుర్తించాలి.
మొనమీద నిలబడితే ఎక్స్పైరీ దగ్గరపడిందని అర్థం.
పైకి తేలినవి పాడైపోయినవని గుర్తించాలి. కాబట్టి పైకి తేలిన గుడ్లను తినకపోవడం ఆరోగ్యానికి మంచిది.