అయితే.. ఎరుపు పుచ్చకాయతో పోల్చుకుంటే.. పసుపు పెచ్చకాయలో విటమిన్స్ అధికంగా ఉంటాయి.
పసుపు పుచ్చకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
అంతేకాకుండా సిట్రులిన్, అమైనో ఆమ్లాలు, లైకోపీన్, పొటాషియం, విటమిన్ ఎ, సి లు ఇందులో ఎక్కువగా ఉంటాయి.
పసుపు పుచ్చకాయ మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్, సహజ చక్కెర ఉంటుంది.
ఎర్ర పుచ్చకాయతో పోలిస్తే, పసుపు పుచ్చకాయలో అధిక విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పసుపు పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉంటాయి.
అంతేకాకుండా పసుపు పుచ్చకాయలో కొవ్వు కంటెంట్ ఉండదు. కావున మీరు డైటింగ్‌లో ఉన్నా కూడా ఇది తీసుకోవచ్చు.
పసుపు పుచ్చకాయలో కొల్లాజెన్ కంటెంట్ ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.
క్రమం తప్పకుండా పుచ్చకాయను తీసుకోవడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. చిగుళ్ల వాపు, నోటి సమస్యలను నివారిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పసుపు పుచ్చకాయలో ఉండే అధిక నీటి కంటెంట్ విరేచనాలు, మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడుతుంది.
పుచ్చకాయలో ఉండే పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా సహాయపడతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.