చిటికెడు కుంకుమ పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

కుంకుమ పువ్వును ఆహారంగా తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజలు ఉంటాయని వైద్యపరిశోధనల్లో తేలింది. కండరాల నొప్పుల నుంచి మెదడు పని తీరు వరకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కుంకుమ పువ్వుతో ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం
కుంకుమ పువ్వు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజాలు, విటమిన్లను అధికంగా కలిగి ఉంటుంది.
కుంకుమ పువ్వును గర్భిణీలకు తప్పనిసరిగా ఇస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆ కండరాలు బలాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
కుంకుమ పువ్వు యాంటీ డిప్రెసెంట్గా పని చేస్తుంది. ఆస్తమా, తేలికపాటి ఉబ్బసం తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ను నివారిస్తుంది. మచ్చల క్షీణతను తగ్గిస్తుంది. ఆ మెదడు ఆరోగ్య పని తీరును మెరుగుపరుస్తుంది.
ఆ గ్యాస్ట్రిక్ అల్సర్ లక్షణాల తీవ్రతను తగ్గించి, నివారించడంలో తోడ్పడుతుంది.
విటమిన్ ఏ, బీ1, బీ2, సీ వంటి విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. క్రోసిన్, క్రోసిటిన్, సఫ్రానల్ అనేవి ఈ మొక్క ప్రధాన భాగాలు. ఇవి రంగు, రుచి, వాసనకు దోహదం చేస్తాయి.
యూఎస్ఏ పోషక విలువల డేటాబేస్ ప్రకారం 100 గ్రాముల కుంకుమ పువ్వు నీరు 119 గ్రా., శక్తి 310కేలరీలు, ప్రొటీన్ 11.43గ్రా., కొవ్వు 5.85గ్రా., బూడిద 5.45గ్రా., కార్బోహైడ్రేట్ 65.37గ్రా., ఫైబర్ 3.9గ్రాముల పోషకాలను అందిస్తుంది.