చలికాలం బెల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ఏ సీజన్లో అయినా అందుబాటులో ఉండే బెల్లంను ప్రతి రోజూ చిన్న ముక్కను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా చలికాలం బెల్లం తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బెల్లంలోని పొటాషియం హైబీపీ సమస్యను తగ్గిస్తుంది. అలాగని అధికంగా కూడా తీసుకోకూడదు.
చలికాలం ఎక్కువగా వేధించే అనారోగ్య సమస్యలు జలుబు, దగ్గు వంటి వ్యాధులను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
చలికాలంలో ఏ పని చేయాలన్నా బద్దకంగా అనిపిస్తుంది. అలాగే ఎక్కువగా పడుకోవాలనే అనిపిస్తుంది. దీంతో కండరాలు అంతగా పని చేయవు. కాబట్టి కండరాల పనితీరు మెరుగుపడాలంటే బెల్లం తినాలి.
అలాగే ఇందులోని మెగ్నీషియం నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. అంతే కాకుండా బెల్లంలో ఐరన్‌ను కలిగి ఉండి శరీరానికి శక్తినిచ్చేలా చేస్తుంది.
ఇటీవల ఎంతో మంది గుండె జబ్బులతో మరణించిన సంగతి తెలిసిందే. కాబట్టి బెల్లం తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
బెల్లం తీసుకుంటే చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి.