అరిటాకులో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అరిటాకులో భోజనం చేయడం తరతరాలుగా వస్తున్న హిందువుల సాంప్రదాయం. పూర్వకాలం పేపర్ ప్లేట్స్ ఉండేవి కావు. చక్కగా అరిటాకులోనే తినేవారు.
ఇప్పుడు కొందరు మాత్రమే అరిటాకుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
అరిటాకులో వేడి భోజనం పెడితే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ మైక్రోబియల్ ఉండటం వల్ల సూక్ష్మజీవులు తొలగిపోయి పలు వ్యాధులు రాకుండా ఉంటుంది.
దీనివల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పొట్టలో ఉండే జీవ రసాలు విడుదలవుతాయి.
అరటి పండులాగే ఆకులో పొటాషియం ఉంటుంది కాబట్టి గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.
వీటిలో ఉండే పాలిఫెనాల్ రోగనిరోధక శక్తిని పెంచి పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. మనం తినే ఆహారంలో ఏమైనా విష పదార్థాలు కలిసినా అరిటాకు కలర్ చేంజ్ అవుతుంది. అది గమనిస్తే ప్రాణాలతో బయటపడవచ్చు.
అరిటాకులో వేడి భోజనం పెడితే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ మైక్రోబియల్ ఉండటం వల్ల సూక్ష్మజీవులు తొలగిపోయి పలు వ్యాధులు రాకుండా ఉంటుంది.
అరిటాకులో విటమిన్ ఏ, సీ వంటివి అనేకమైన పోషకాలు ఉంటాయి. దీంతో ఆహారంలోకి పోవడంతో వాటిని తింటే శరీరానికి మేలు చేకూరుతుంది.
ఈ ఆకు వల్ల మన ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. దీనిని తిన్న తర్వాత మట్టిలో పడేస్తే భూమిలో కలిసిపోయి సారవంతంగా మారుతుంది.
అరిటాకులో తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. దీంతో బరువు పెరగాలి అనుకునే వారికి మేలు జరుగుతుంది.