గోరింటాకుతో ఇలా చేస్తే శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

గోరింటాకును చాలా మంది మహిళలు ఎక్కువగా ఆషాడంలో పెట్టుకుంటారు. చేతులు ఎర్రగా పండితే మంచిదని పెద్దలు చెబుతుంటారు.
అయితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గిపోవడంతో పాటు శరీరానికి కూడా చాలా ప్రయోజనాలున్నాయి.
తలనొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడేవారు గోరింటాకును కచ్చితంగా తలకు పట్టించాలి. అలా చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది.
ఇటీవల చాలా మందిని వేధిస్తున్న సమస్య తెల్ల వెంట్రుకలు. అలాంటి వారు గోరింటాకును వారానికోసారి పెట్టుకోవాలి.
మైదాకు నమలడం వల్ల చిగుళ్ల వ్యాధి తగ్గడంతో పాటు నోటి పూత పోతుంది.
గోరింటాకు బెరడు లేదా ఆకులను నీటిలో నానబెట్టి వాటిని తాగితే కాలేయం, గుండె ఆరోగ్యంగా ఉంటాయి.
గోరు పుచ్చిపోయిన ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.