దానిమ్మ చెట్టు ఆకుల టీ తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

దానిమ్మ పండ్లు తియ్యగా రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే.
అయితే దానిమ్మ కాయలే కాకుండా చెట్టు ఆకులు కూడా ప్రయోజనాలు కలిగిస్తాయి. పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటితో టీ తయారు చేసుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే ఈ టీని రోజుకు రెండు పూటలా తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది.
ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున దానిమ్మ ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది.
వీటి పేస్ట్‌ను చర్మపై రాసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
తరచూ వాంతులు అవుతున్న వారు ఈ పొడిని రోజూ వేడి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి దరి చేరకుండా ఉండాలంటే దానిమ్మ ఆకుల టీ తాగాలి.
ఇప్పుడున్న బిజీ బిజీ జీవితంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి. అలాంటి వారు ఈ టీని కచ్చితంగా తీసుకోవాలి.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఈ ఆకుల టీని తాగుతూ ఉండాలి. అలా అని అధికంగా తీసుకోకూడదు.